Pages

10, జూన్ 2013, సోమవారం

ప్రేమ కన్నా గొప్పది ‘ఆరాధన’

ప్రేమ కన్నా గొప్పది ‘ఆరాధన’
స్నేహం...ప్రేమ...త్యాగం... వీటికి అతీతమైనది ‘ఆరాధన‘
అపార్థాలకు... అవమానాలకు వెరవనిది ‘ఆరాధన’
అనురాగమనే అమరభావన ‘ఆరాధన’
కలల నెచ్చెలికి ఓ భక్తుడిచ్చే హారతి ‘ఆరాధన’

కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...

కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...
మరపురాని మన స్నేహాన్ని గతంగా మార్చేసింది
అప్పుడు ఆగిపోయిన నిమిషాల ముల్లు
ప్రతి క్షణం నీవులేని లోటును తెలుపుతూనే వుంది
కష్టమొచ్చినప్పుడు కన్నీటి కంటే ముందు
నేనున్నానని భరోసానిచ్చే ఆ నేస్తం... ముఖంచాటేసింది
మనుషులు విడిపోవచ్చు... మనసులు ఓడిపోవచ్చు...
మమతలు మాసిపోవచ్చు... మారనిది స్నేహమొక్కటే..
ఔను...నిజమే....
ఇప్పటికీ ఏం మారలేదు...  నువ్వు గుర్తొస్తేచాలు...
చిరుగాలి కన్నా చల్లని నీ చిరునవ్వు నను పలకరించి పోతుంది
ఎప్పటికీ వెంటాడుతూండే ఆ కళ్ళలోని మెరుపు నను తాకి వెళుతుంది

అర్థం... అపార్థం

ఈ రెండిటి మధ్య తేడా ఒక్క అక్షరం
ఈ రెండిటి మధ్య దూరం అనంతం
మనసులో భావాన్ని ‘అర్థం’ చేసుకోగలిగితే
కలిగే అనుభూతి జీవితాంతం
మనసులో భావాన్ని ‘అపార్థం’ చేసుకుంటే
కలిగే ఎడబాటు ఓ జీవితకాలం

చెలియా!

చాలించవా నీవింక అలుక
ఏమిచేశానని నీకింత కినుక
వీడను నిన్ను ముమ్మాటికీ
నీవే నా చెలి జన్మజన్మలకీ
దూరం చేయకు నీ చిరునవ్వుని
మరువకది నా కంటి వెలుగని
వెన్నెలవిరయు నీ నవ్వు
మది నిండా వసంతాలు రువ్వు
వేచి ఉంటా నీ ప్రేమ కొరకు
ఎదురు చూస్తా జన్మజన్మలకు

నా జాబిలమ్మా

దిగులు పడకే ఓ జాబిలమ్మా
కమ్ము మేఘాలు శాశ్వతమ్మా
చిరుగాలి తరగలకవి చెదరులెమ్మా
మళ్ళీ వెన్నెలలు విరబూయునమ్మా

మోమున దరహాసమ్ము చెరగనీకమ్మా
మనసున నిబ్బరమ్ము సడలనీకమ్మా
అదే విజయపథమ్ము నిలుపులెమ్మా
దిగులు పడకే నా జాబిలమ్మా

14, ఏప్రిల్ 2012, శనివారం

నండూరి వారి ఎంకిలా

పొరబాట్లు చేయడం నాకలవాటు
క్షమించేయడం నీకలవాటు
చీవాట్లు పెడతావనుకుంటాను
పర్యావసానాలను వివరిస్తావు
ఆ క్షణం నాకెలా కనిపిస్తావో తెలుసా...
అమ్మలా... అమ్మలా కనిపిస్తావు
మన్ను తిన్న కృష్ణయ్యను చెవిమెలేసి
మందలిస్తున్న యశోదమ్మలా...
అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న
కృష్ణపరమాత్మలా... కనిపిస్తావు

వెళ్తూ...వెళ్తూ తల తిప్పకుండానే
కళ్ళు మాత్రమే తిప్పి ఓరగా చూస్తావు
కాలాన్ని స్తంభింపజేసే  ఆ చూపు కోసం...
ఆ క్షణం కోషం ఎంతగానో పరితపిస్తాను
అప్పుడు నాకెట్లా కనిపిస్తావో తెలుసా...
ఎంకిలా... నండూరి వారి ఎంకిలా కనిపిస్తావు
మరుక్షణం మాయమై జీవశ్చవాన్ని చేస్తావు
ఆ క్షణం సత్యవంతుడి ప్రాణాలు కొనిపోయే
యముడిలా కనిపిస్తావు...
పతి ప్రాణాల కోసం సావిత్రి చేసే పోరాటంలా...
నా మనస్సు నీవెంటే పరుగులు పెడుతుంది

10, జూన్ 2013, సోమవారం

ప్రేమ కన్నా గొప్పది ‘ఆరాధన’

ప్రేమ కన్నా గొప్పది ‘ఆరాధన’
స్నేహం...ప్రేమ...త్యాగం... వీటికి అతీతమైనది ‘ఆరాధన‘
అపార్థాలకు... అవమానాలకు వెరవనిది ‘ఆరాధన’
అనురాగమనే అమరభావన ‘ఆరాధన’
కలల నెచ్చెలికి ఓ భక్తుడిచ్చే హారతి ‘ఆరాధన’

కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...

కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...
మరపురాని మన స్నేహాన్ని గతంగా మార్చేసింది
అప్పుడు ఆగిపోయిన నిమిషాల ముల్లు
ప్రతి క్షణం నీవులేని లోటును తెలుపుతూనే వుంది
కష్టమొచ్చినప్పుడు కన్నీటి కంటే ముందు
నేనున్నానని భరోసానిచ్చే ఆ నేస్తం... ముఖంచాటేసింది
మనుషులు విడిపోవచ్చు... మనసులు ఓడిపోవచ్చు...
మమతలు మాసిపోవచ్చు... మారనిది స్నేహమొక్కటే..
ఔను...నిజమే....
ఇప్పటికీ ఏం మారలేదు...  నువ్వు గుర్తొస్తేచాలు...
చిరుగాలి కన్నా చల్లని నీ చిరునవ్వు నను పలకరించి పోతుంది
ఎప్పటికీ వెంటాడుతూండే ఆ కళ్ళలోని మెరుపు నను తాకి వెళుతుంది

అర్థం... అపార్థం

ఈ రెండిటి మధ్య తేడా ఒక్క అక్షరం
ఈ రెండిటి మధ్య దూరం అనంతం
మనసులో భావాన్ని ‘అర్థం’ చేసుకోగలిగితే
కలిగే అనుభూతి జీవితాంతం
మనసులో భావాన్ని ‘అపార్థం’ చేసుకుంటే
కలిగే ఎడబాటు ఓ జీవితకాలం

చెలియా!

చాలించవా నీవింక అలుక
ఏమిచేశానని నీకింత కినుక
వీడను నిన్ను ముమ్మాటికీ
నీవే నా చెలి జన్మజన్మలకీ
దూరం చేయకు నీ చిరునవ్వుని
మరువకది నా కంటి వెలుగని
వెన్నెలవిరయు నీ నవ్వు
మది నిండా వసంతాలు రువ్వు
వేచి ఉంటా నీ ప్రేమ కొరకు
ఎదురు చూస్తా జన్మజన్మలకు

నా జాబిలమ్మా

దిగులు పడకే ఓ జాబిలమ్మా
కమ్ము మేఘాలు శాశ్వతమ్మా
చిరుగాలి తరగలకవి చెదరులెమ్మా
మళ్ళీ వెన్నెలలు విరబూయునమ్మా

మోమున దరహాసమ్ము చెరగనీకమ్మా
మనసున నిబ్బరమ్ము సడలనీకమ్మా
అదే విజయపథమ్ము నిలుపులెమ్మా
దిగులు పడకే నా జాబిలమ్మా

14, ఏప్రిల్ 2012, శనివారం

నండూరి వారి ఎంకిలా

పొరబాట్లు చేయడం నాకలవాటు
క్షమించేయడం నీకలవాటు
చీవాట్లు పెడతావనుకుంటాను
పర్యావసానాలను వివరిస్తావు
ఆ క్షణం నాకెలా కనిపిస్తావో తెలుసా...
అమ్మలా... అమ్మలా కనిపిస్తావు
మన్ను తిన్న కృష్ణయ్యను చెవిమెలేసి
మందలిస్తున్న యశోదమ్మలా...
అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న
కృష్ణపరమాత్మలా... కనిపిస్తావు

వెళ్తూ...వెళ్తూ తల తిప్పకుండానే
కళ్ళు మాత్రమే తిప్పి ఓరగా చూస్తావు
కాలాన్ని స్తంభింపజేసే  ఆ చూపు కోసం...
ఆ క్షణం కోషం ఎంతగానో పరితపిస్తాను
అప్పుడు నాకెట్లా కనిపిస్తావో తెలుసా...
ఎంకిలా... నండూరి వారి ఎంకిలా కనిపిస్తావు
మరుక్షణం మాయమై జీవశ్చవాన్ని చేస్తావు
ఆ క్షణం సత్యవంతుడి ప్రాణాలు కొనిపోయే
యముడిలా కనిపిస్తావు...
పతి ప్రాణాల కోసం సావిత్రి చేసే పోరాటంలా...
నా మనస్సు నీవెంటే పరుగులు పెడుతుంది